కొన్ని రకాల జీవులు కళ్లు తెరిచి నిద్రపోతాయి. ఈ జాబితాలో పాములు కూడా ఉన్నాయి. కను రెప్పలు లేకపోవడంతో పాములు ఎల్లప్పుడూ కళ్లు తెరిచే నిద్రపోతుంటాయి. నిద్రలో కూడా పాములు కళ్లు మూయవు. కను రెప్పలు లేనప్పటికీ పాముల కంట్లో సన్నని పొర ఉంటుంది. దీనిని బ్రిల్ అని పిలుస్తారు. దీనికి జర్మన్ భాషలో 'అద్దాలు' అని అర్ధం వస్తుంది. ఈ బ్రిల్ అనే పొర పాము కళ్లను నిత్యం కాపాడుతూ ఉంటుంది.