రిటైర్డ్‌​మెంట్​ డబ్బుల కోసం కన్నతండ్రిని చంపిన పిల్లలు

1569చూసినవారు
రిటైర్డ్‌​మెంట్​ డబ్బుల కోసం కన్నతండ్రిని చంపిన పిల్లలు
రంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. బాలాపూర్‌ మండలానికి చెందిన మేడిపల్లి కృష్ణ(58)కు ఓ కుమారుడు, ఐదుగురు కుమార్తెలు. మేడిపల్లి కృష్ణ వాటర్‌ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసి 2018లో రిటైర్డ్‌​మెంట్. ఆ సమయంలో వచ్చిన డబ్బులను ఇవ్వాల్సిందిగా కొడుకు, ఇద్దరు కుమార్తెలు 2018 నవంబర్ 4న తండ్రిపై దాడికి దిగడంతో.. తండ్రి అక్కడికక్కడే మరణించారు. మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కేసును విచారించిన కోర్టు శుక్రవారం నిందితులకు జీవిత ఖైధు విధించింది.

సంబంధిత పోస్ట్