HYD: చిక్కడపల్లిలోని త్యాగరాయగానసభలో MLC ప్రో. కోదండరాంకు ఆత్మీయ పౌర సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'ఉద్యమ విలువలకు సన్మానం జరగాల్సిన అవసరం ఉంది. రాహుల్ గాంధీ చెప్పిన మాటలు, ఆలోచన బాగా నచ్చినందు వల్లే కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చాను. సామాజిక అసమానతలు తొలగించినప్పుడే రాజకీయ సమానత్వం లభిస్తుంది. వరదల వేళ తెలుగు రాష్ట్రాల్లో CM, మంత్రులు పర్యటించడం శుభ పరిణామం' అని అన్నారు.