'స్పేడెక్స్‌' డాకింగ్‌ ప్రక్రియ మరోసారి వాయిదా

84చూసినవారు
'స్పేడెక్స్‌' డాకింగ్‌ ప్రక్రియ మరోసారి వాయిదా
జంట ఉపగ్రహాలను భూ కక్ష్యలో అనుసంధానం చేయడమే లక్ష్యంగా ఇస్రో చేపట్టిన స్పేస్‌ డాకింగ్‌ ఎక్స్‌పెరిమెంట్‌ (స్పేడెక్స్‌)ను ఇటీవల జనవరి 9వ తేదీకి వాయిదా పడిన విషయం తెలిసిందే. తాజాగా రెండు ఉపగ్రహాల మధ్య దూరాన్ని 225 మీటర్లకు చేర్చేందుకు ఓ విన్యాసం నిర్వహించగా.. రెండింటి మధ్య దూరం ఊహించిన దాని కంటే ఎక్కువ ఉన్నట్లు తేలిందని ఇస్రో ట్వీట్‌ చేసింది. దీంతో 9న జరగాల్సిన డాకింగ్ వాయిదా పడిందని, ఉపగ్రహాలు సురక్షితంగా ఉన్నాయని ఇస్రో వెల్లడించింది.

సంబంధిత పోస్ట్