అయోధ్య రాముడి దర్శనానికి రాష్ట్రాలకు ప్రత్యేక స్లాట్లు!

81చూసినవారు
అయోధ్య రాముడి దర్శనానికి రాష్ట్రాలకు ప్రత్యేక స్లాట్లు!
అయోధ్య రాముడి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రాల వారీగా స్లాట్లు కేటాయించాలని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు భావిస్తోంది. ఒక్కో రాష్ట్రానికి షెడ్యూల్ కేటాయించేలా.. అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు ఆహ్వానాలు పంపేందుకు సిద్ధమైంది. ఆయా తేదీలు, సమయాల్లోనే ఆ రాష్ట్రం నుంచి భక్తులు దర్శనానికి వచ్చేలా ఏర్పాట్లు చేయనుంది. భక్తుల రద్దీ తగ్గాక వీఐపీ దర్శనాలు ప్రారంభించాలని ట్రస్టు భావిస్తోంది.

సంబంధిత పోస్ట్