తెలంగాణలో సమగ్ర కుటుంబ సర్వే చేయుటకు సర్కిల్ వారీగా ఎన్యుమరేటర్ లకు ప్రత్యేక శిక్షణ తరగతులు ఏర్పాటు చేశారు. నవంబర్ నెలలో జరిగే సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే కార్యక్రమం సకాలంలో పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్ణయించింది. కమిషనర్ ఆదేశాల మేరకు బుధవారం సర్కిల్ వారీగా ఎనుమరేటర్లకు సర్వే ప్రొఫార్మాను ఎలాంటి మార్గదర్శకాలతో పూరించాలో మాస్టర్ ట్రైనర్లు వివరించారు.