చిత్ర నిర్మాణ సంస్థను పెట్టి ఆర్ధికంగా నష్టపోయిన శ్రీశ్రీ

69చూసినవారు
చిత్ర నిర్మాణ సంస్థను పెట్టి ఆర్ధికంగా నష్టపోయిన శ్రీశ్రీ
1959లో శ్రీశ్రీ ’ఉషశ్రీ పిక్చర్స్‘ అనే చిత్రనిర్మాణ సంస్థను నెలకొల్పి తీసిన ’చెవిలో రహస్యం’ సినిమా ఫ్లాప్ అయింది. దాంతో శ్రీశ్రీ ఆర్ధికంగా నష్టపోయారు. 1964లో ‘కవలపిల్లలు’ అనే డబ్బింగ్ సినిమాను నిర్మించి మరోసారి శ్రీశ్రీ చేతులు కాల్చుకున్నారు. శ్రీశ్రీ ‘రుక్మిణీ కల్యాణం’ కథను అక్కినేని నాగేశ్వరరావు విన్నారు. పంపిణీ సంస్థలతో మాట్లాడి ఆర్దిక సహాయం చేస్తానని మాటిచ్చారు. అక్కినేని, కృష్ణకుమారి నటిస్తామని అన్నారు. ఈ సినిమాలో రెండు పాటలు రికార్డింగ్ చేయించారు. అయితే ఆ సినిమా ప్రాజెక్ట్ అలాగే మూలపడిపోయింది. శ్రీశ్రీ జేబుకి మాత్రం ఇరవై వేల రూపాయల కిలుం వదిలింది.

సంబంధిత పోస్ట్