ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని కథానాయకుడిగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. కావ్య థాపర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. తాజాగా ఈ మూవీలోని ‘స్టెప్ మార్’ అంటూ సాగే లిరికల్ సాంగ్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 15న విడుదల కానుంది.