భారత స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం ఫ్లాట్‌గా ముగిశాయి. ముగింపులో సెన్సెక్స్ 166.33 పాయింట్లు క్షీణించి 78,593.07 వద్ద, నిఫ్టీ 63.05 పాయింట్లు నష్టపోయి 23,992.55 వద్ద ఉన్నాయి. నిఫ్టీలో బ్రిటానియా షేర్లు అత్యధిక లాభాలను పొందగా, HDFC లైఫ్ షేర్లు అత్యధికంగా నష్టపోయాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.95 వద్ద సరికొత్త రికార్డు స్థాయిలో ముగిసింది.