స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఇవాళ ఉదయం 9:30 గంటల సమయంలో సెన్సెక్స్ 323 పాయింట్లు పెరిగి 78,806 వద్ద ట్రేడవుతుండగా.. నిఫ్టీ 104 పాయింట్లు పెరిగి 23,854 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్ 30 సూచీలో ఇండస్‌ఇండ్ బ్యాంక్, టాటా మోటార్స్, జొమాటో, ఎన్టీపీసీ, టెక్‌మహీంద్రా, ఎస్‌బీఐ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. హెచ్‌సీఎల్, టీసీఎస్, అదానీ పోర్ట్స్, టైటాన్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.