ఎస్టీలుగా గుర్తింపు కోసం 20 ఏళ్లుగా పోరాటం.!

58చూసినవారు
ఎస్టీలుగా గుర్తింపు కోసం 20 ఏళ్లుగా పోరాటం.!
ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో కవిటి, కంచిలి, ఇచ్ఛాపురం, పాతపట్నం మండలాల్లో బెంతు ఒరియా కులస్థులుగా చెప్పుకొనేవారు వేలాది మంది నివసిస్తున్నారు. ప్రభుత్వం కుల ధ్రువీకరణ పత్రాల్లో వీరిని ఒరియా అనే ఓసీ కులంగా గుర్తిస్తున్నారు. దీంతో వీరంతా తాము గిరిజనుల కిందకు వస్తామని అంటున్నారు. ప్రభుత్వాలు తమకు ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలని కోరుతూ 20 ఏళ్లుగా వివిధ రకాలుగా ఆందోళనలు చేస్తూ వస్తున్నారు. వీరంతా ఎస్టీ కాదని, ఎస్టీలుగా గుర్తిస్తే గిరిజనులకు అన్యాయం జరుగుతుందని సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.

సంబంధిత పోస్ట్