కొందరు సోషల్ మీడియాలో పాపులర్ కావడం కోసం వింత ప్రయత్నాలు చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇలాంటి ఘటనకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ మేరకు ఓ యువకుడు రన్నింగ్ ట్రైన్ లో డోర్ వద్ద నిల్చొని ప్రమాదకర స్టంట్స్ చేశాడు. ఫుట్ బోర్డు వద్ద బయటకు వేలాడుతూ డ్యాన్స్ చేశాడు. దీనిని మరొకరు వీడియో తీస్తుండగా అతడికి ట్రాక్ వెంబడి ఉండే స్థంభం తాకింది. దీంతో ఆ యువకుడు కింద పడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.