రోడ్లపై స్కూటీలతో స్టంట్స్.. కోపంతో స్థానికులు స్కూటీలను ఫ్లై ఓవర్‌పై నుంచి కిందకి పడేశారు

56చూసినవారు
కర్నాటకలోని బెంగళూరులో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. తుమకూరు నేషనల్ హైవే ఫ్లైఓవర్‌పై యువకులు ముందు చక్రాలు పైకి లేపుతూ స్టంట్స్ చేయడంతో స్థానికులు విసుగు చెంది బైక్‌లను ఫ్లై ఓవర్‌పై నుంచి కిందకి విసిరివేశారు. ఈ ఘటనను స్థానికులు వీడియో తీసి పోలీసులతో పంచుకున్నారు. కొంతమంది డ్రైవర్లను పోలీసులు అరెస్టు చేశారు. "నగర రోడ్లపై వీలింగ్ (స్టంట్స్) చేస్తున్నారా? మీ సాహసాన్ని ఆపడానికి మా అధికారులు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు" అని పోలీసులు ట్వీట్ చేశారు. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

సంబంధిత పోస్ట్