సూసైడ్ బాంబ్.. 18 మంది మృతి

67చూసినవారు
సూసైడ్ బాంబ్.. 18 మంది మృతి
నైజీరియాలోని ఈశాన్య బోర్నో రాష్ట్రంలో శనివారం మహిళా ఆత్మాహుతి బాంబర్లు వరుస దాడులు చేశారు. ఈ దుర్ఘటనలో కనీసం 18 మంది చనిపోయారు. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. గ్వోజా పట్టణంలో ఒక పెళ్లి, అంత్యక్రియలు, ఆసుపత్రిని టార్గెట్ చేసుకుని ఈ దాడులు చేశారు. మిలిటెంట్ గ్రూపులను నైజీరియా సైన్యం గతంలో నిర్వీర్యం చేశారు. అయినప్పటికీ వారు సామాన్య పౌరులు, భద్రతా దళాలపై దాడులు కొనసాగిస్తున్నారు.

సంబంధిత పోస్ట్