వ్యోమగాముల కోసం స్పేస్ఎక్స్ వ్యోమనౌకను సిద్ధం చేస్తోంది. దీంతో మరికొన్ని నెలల పాటు సునీతా, విల్మోర్ అంతరిక్ష కేంద్రంలోనే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. స్పేక్స్ క్రూ-9 మిషన్లో భాగంగా ఇద్దరు వ్యోమగాములతో క్రూ డ్రాగన్ను నాసా ఐఎస్ఎస్కు పంపించే అవకాశాలున్నాయి. ఈ ఏడాది సెప్టెంబరులో ఈ ప్రయోగం ఉండొచ్చని సమాచారం. ఈ వ్యోమనౌకతో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సునీత, విల్మోర్ను భూమ్మీదకు తీసుకురావాలని నాసా భావిస్తున్నట్లు సమాచారం.