అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన భారత సంతతికి చెందిన నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ త్వరలో భూమికి చేరనున్నారు. ఆమెతో పాటు అక్కడే ఉన్న బుచ్ విల్మోర్ కూడా కిందకి రానున్నారు. మార్చి మధ్యలో వారిద్దరిని భూమికి తీసుకువచ్చేందుకు స్పేస్‌ఎక్స్ సంస్థ వ్యోమనౌకను పంపనుందని మంగళవారం నాసా ప్రకటించింది. సునీత, విల్మోర్ అంతరిక్ష కేంద్రానికి చేరి గత వారానికి ఎనిమిది నెలలు పూర్తయ్యాయి.