బిభవ్‌ కుమార్‌పై సుప్రీం ఆగ్రహం

51చూసినవారు
బిభవ్‌ కుమార్‌పై సుప్రీం ఆగ్రహం
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్‌ కుమార్‌‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆప్ ఎంపీ స్వాతి మలివాల్‌పై దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న బిభవ్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌పై ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టింది. ఈ ఘటన దిగ్భ్రాంతి కలిగించిందని, నివాసంలోకి ప్రవేశించిన ఓ గూండా స్వాతి మలివాల్‌పై దాడి చేసినట్లు అనిపించిందని కోర్టు పేర్కొంది. ముఖ్యమంత్రి బంగ్లా ఏమైనా వ్యక్తిగత నివాసమా? అని ప్రశ్నించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్