గవర్నర్ వ్యవస్థపై సుప్రీంకోర్టు జడ్జి కీలక వ్యాఖ్యలు

67చూసినవారు
గవర్నర్ వ్యవస్థపై సుప్రీంకోర్టు జడ్జి కీలక వ్యాఖ్యలు
దేశంలో గవర్నర్ల వ్యవస్థపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీవీ నాగరత్న కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా బెంగళూరులో జరిగిన NLSIU-PACT సదస్సులో పాల్గొన్న జస్టిస్ నాగరత్న పలు అంశాలపై ప్రసంగించారు. గవర్నర్లు చేయాల్సిన పనులు కాకుండా చేయకూడని పనులు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. క్రియాశీల పాత్ర పోషించాల్సి వచ్చినప్పుడు నిష్క్రియంగా ఉంటారని అన్నారు. సుప్రీంకోర్టులో గవర్నర్ల అంశంపై ప్రస్తుతం నడుస్తున్న కేసులు విచారకరం అని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్