ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టైన ఆ రాష్ట్ర సీఎం అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు ఇవాళ (శుక్రవారం) తీర్పు ఇచ్చే అవకాశం ఉంది. లిక్కర్ స్కామ్ కేసులో తనను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేయడాన్ని కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో సవాలు చేస్తూ పిటిషన్ ఫైల్ చేశారు. కేజ్రీవాల్ పిటిషన్‌పై జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు వెలువరించనుంది.