ఒడిశా నూతన సీఎంగా BJP ఎమెల్మే సురేష్ పూజారి బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. సీఎం పదవి కోసం BJPలో చాలా మంది నేతలు పోటీ పడుతున్నారు. ఈ తరుణంలో సురేష్ పూజారిని పార్టీ అధిష్టానం ఢిల్లీకి పిలిచింది. దీంతో ఆయనకే సీఎం పదవి దక్కుతుందనే ప్రచారం ఊపందుకుంది. ఆయనతో పాటు కేంద్ర మాజీ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, జమ్మూకాశ్మీర్ మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ గిరీష్ చంద్ర, ఎంపీ ప్రతాప్ సారంగి సైతం సీఎం పదవి రేసులో ఉన్నారు.