రోడ్డుపై అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం అమీనాబాద్ కు చెందిన గుండు లక్ష్మణ్(35) బుధవారం కొత్తూరు-సూర్ధేపల్లి గ్రామాల రహదారి మధ్యలో మృతి చెంది ఉన్నాడు. శరీరంపై స్వల్ప గాయాలు, పక్కనే బైక్ ఉండటం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. మృతుడి తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.