హుజూర్ నగర్ లోని జ్ఞాన సరస్వతి దేవాలయంలో శనివారం కూడారై ఉత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తర్వాత 108 పాయసం గిన్నెలతో స్వామివారికి నివేదించారు. టి. టి. డి ఆల్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్ట్ తిరుప్పావై ప్రచారకులు ముడుంబై దామోదర చార్యులు ప్రత్యేక పూజ లు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షురాలు పొట్టు ముత్తు సోమలక్ష్మి, శ్రీలత అప్పారావు, జానకి, చంద్రకళ, అర్చకులు పురుషోత్తమ శర్మ పాల్గొన్నారు.