బతుకమ్మ దేవత మహిళ ల గుండె చప్పుడు అని కోదాడ మునిసిపల్ ఛైర్ పర్సన్ సామినేని ప్రమీల రమేష్ అన్నారు. బుధవారం కోదాడ బాలుర ఉన్నత పాఠశాల లో8వ రోజు బతుకమ్మ వేడుకలు ప్రారంభించిj మాట్లాడారు. పూలను దేవతలు గా భావించి పూజించే పెద్ద పండుగ బతుకమ్మ అన్నారు. ఈ కార్యక్రమం లో మునిసిపల్ కమిషనర్ రమాదేవి, మహిళా నాయకులు నూనె సులోచన, శైలజా, కౌన్సిలర్ లు ఉన్నారు.