కోదాడ నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తున్నామని కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. ఆదివారం కోదాడ పట్టణంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ శంకుస్థాపన చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శరవేగంగా విస్తరిస్తున్న కోదాడ పట్టణంలో భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని సమీకృత వెజ్ మరియు నాన్ వెజ్ మార్కెట్ యార్డ్ ను నిర్మిస్తున్నామని ఆయన అన్నారు. అత్యాధునిక పద్ధతుల్లో మార్కెట్ యార్డ్ లో నిర్మిస్తున్నామని ఆయన తెలిపారు. సమీకృత మార్కెట్ తో ప్రజలకు, రైతులకు ఎంతో ఉపయోగమని తెలిపారు. అన్ని ఒకే వద్ద దొరికే విధంగా 108 సముదాయాలతో మార్కెట్ ను నిర్మిస్తున్నాము, అందులో వ్యాపార దుకాణాలు, కూరగాయల దుకాణాలు, సూపర్ మార్కెట్లు, వెజ్ మరియు నాన్ వెజ్ దుకాణాలు, పండ్ల దుకాణాలు, ఉండేలా నిర్మాణాలను చేపడుతున్నామని వివరించారు.
పెరుగుతున్న జనాభా అవసరాలకు దృష్టి పట్టణంలో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. కోట్లాది రూపాయలతో కోదాడ మున్సిపాలిటీ ని ఆదర్శ మున్సిపాలిటీగా అభివృద్ధి చేస్తున్నామని ఆయన తెలిపారు. ప్రతి నెల మున్సిపాలిటీల అభివృద్ధి కోసం కోట్లా రూపాయల నిధులు మంజూరు చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని ఆయన అన్నారు. రాష్ట్రంలోని పట్టణాల్లోని అభివృద్ధి చెందాలని లక్ష్యంతో ముఖ్యమంత్రి కెసిఆర్ గారు పని చేస్తున్నారని అన్నారు. పట్టణ ప్రగతి పేరుతో అనేక అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నామన్నారు. ప్రణాళిక బద్దంగా పారిశుద్ధ్య పనులు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. కోదాడ మున్సిపాలిటీ పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసే బాధ్యత నాదని ఆయన అన్నారు. కోదాడ పట్టణంలో విలీన గ్రామాల్లో కోట్ల రూపాయలతో అత్యాధునిక పద్ధతుల్లో అభివృద్ధి చేస్తున్నామని, అందులో భాగంగానే అంతిమ సంస్కారాల కోసం ప్రభుత్వం వైకుంఠ ధామాలను నిర్మాణం చేస్తుందని అన్నారు.
తమ్మర బండపాలెం లో కోటి రూపాయల వ్యయంతో వైకుంఠధామం శంకుస్థాపన చేస్తామని తెలిపారు. అదే విధంగా బాలాజీ నగర్ లో కోటి రూపాయలతో వైకుంఠధామం శంకుస్థాపన చేశామని అన్నారు. అధికారులు ప్రజల పట్ల నిర్లక్ష్యం చేయకుండా ప్రజా ప్రతినిధులు తమ వార్డుల అభివృద్ధి కోసం అడిగే పనులను తప్పకుండా చేయాలని అధికారులకు సూచించారు. పట్టణ ప్రకృతి వనరులను ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. కోదాడ పట్టణంలో సెంటర్ లైటింగ్ ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన అన్నారు. గత పాలకుల 33 కెవి లైన్ వల్ల మా ప్రాణాలు పోతున్నాయని మొరపెట్టుకున్నా ఎ నాయకుడు పట్టించుకోలేదని ఆయన అన్నారు. నేను ఎమ్మెల్యే అయినా రెండు సంవత్సరాల్లో పట్టణంలో ప్రధాన సమస్య అయిన 33 కెవి లైను మార్చడం జరిగిందని గుర్తు చేశారు. వీటి వ్యాపారస్తులు గత పాలకుల వాడుకుని వదిలేశారని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారికి పట్టాలు ఇచ్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదే అని అన్నారు.
నాలుగు వైపులా విస్తరిస్తున్న పట్టణం లో కోట్ల రూపాయలతో సిసి రోడ్లను డ్రైనేజీ లను ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలిపారు. కోదాడ పట్టణాన్ని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సహకారంతో కోదాడ పట్టణాన్ని మరింత అభివృద్ధి చేసుకునేందుకు ముందుకు వెళ్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పారిశుద్ధ్య సమస్య లేకుండా చేశారని అన్నారు. గతంలో మంచినీటి సమస్య తీవ్రంగా ఉండేదని కానీ గత పాలకుల పట్టించుకున్న పాపాన లేదని అన్నారు. 2018 సంవత్సరాలు నేను ఎన్నికైన తర్వాత మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి మంచినీరు అందిస్తున్నామని తెలిపారు. కోదాడ నియోజకవర్గాన్ని ప్రగతి పథంలో నడిపించేందుకు శక్తివంచన లేకుండా పని పని చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. కోదాడ పట్టణ అభివృద్ధిలో ప్రజలు అందరూ భాగస్వాములు కావాలని ఆయన కోరారు. అనంతరం ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ గారిని ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్ర సుధారాణి పుల్లారెడ్డి, మున్సిపల్ చైర్మన్ వనపర్తి శిరీష మున్సిపల్ కమిషనర్ నాగేంద్రబాబు, ైస్ చైర్మన్ వెంపటి పద్మ మధు, వైస్ చైర్మన్ ఉపేందర్, మార్కెట్ కమిటీ పాలకవర్గం సభ్యులు, పట్టణ అధ్యక్షుడు చందు నాగేశ్వరరావు, అనంత సైదయ్య, రహీం, టిఆర్ఎస్ నాయకులు, మున్సిపల్ కౌన్సిలర్ లు కట్టబోయిన జ్యోతి శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, సుశీల రాజు, కైకస్వామి నాయక్, సమినేని నరేష్, కో ఆప్షన్ సభ్యులు, మున్సిపల్ అధికారులు, ప్రభుత్వ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.