మునగాల ఎస్ఐ ప్రవీణ్ కుమార్ దంపతుల ద్వితీయ పుత్రుడు బి. భైరవ రుద్ర పుట్టినరోజు సందర్భంగా శనివారం కోదాడ పట్టణంలోని శనగల రాధాకృష్ణ అనాధ శరణాలయంలో అన్నదాన కార్యక్రమంలో కుటుంబ సమేతంగా పాల్గొని అనాధ పిల్లలకు అన్నం వడ్డించారు. పోలీసు సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగం చేస్తూ నా కుమారుడి పుట్టినరోజు వేడుకలను తల్లిదండ్రులు లేని అనాధ పిల్లల మధ్య జరుపుకోవడం చాలా గర్వంగా ఉందని ఎస్ఐ అన్నారు.