కోదాడ నియోజకవర్గ ఆడబిడ్డలందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు
By Harish reporter 56చూసినవారుకోదాడ నియోజకవర్గ అన్నా- చెల్లెళ్లకు, అక్క -తమ్ముళ్లకు కోదాడ మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ సోమవారం రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. రాఖీ పండుగను పురస్కరించుకొని ఆయన మాట్లాడుతూ. అన్నా చెల్లెల్లు, అక్కా తమ్ముల ఆత్మీయ అనుబంధానికి రక్ష బంధన్ ప్రతీకగా నిలుస్తుందన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరూ మహిళలను తమ సోదరీమణులుగా భావించి, అండగా ఉన్నప్పుడే అందరికి నిజమైన సార్థకత లభిస్తుందన్నారు.