మునగాల మండలం పరిధిలోని జగన్నాధపురం, రేపాల, కలకోవ , విజయ రాఘవపురం, తదితర గ్రామాల్లో శుక్రవారం రాత్రి నుంచి ఆకాశం మెగావృతమై, నిరంతరాయంగా చిరుజల్లులతో కూడిన వర్షం పడుతుంది. ఈ వర్షం వలన ఆరుతడి పంటలు పత్తి, పెసర వంటి పంటలకు లాభదాయకంగా ఉంటుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.