కోదాడ మండల కేంద్రానికి సమీపంలో ఉన్న కోదాడ - గుడిబండ రోడ్డు ఇండస్ట్రీయల్ ఏరియాగా ప్రసిద్ధి కావడంతో ఈ రోడ్డు గుండా అనేకమైన లారీలు, బస్సులు, కార్లు, ద్విచక్ర వాహనాలు, ఆటోలు తిరగటంతో రోడ్డు అధికంగా గుంతలు ఏర్పడ్డాయి. తద్వారా ఈ రోడ్డు గుండా ప్రయాణించే వాహనదారులు రాక పోకలతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని వాహన దారులు మంగళవారం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.