కోదాడ పబ్లిక్ క్లబ్ పాత కార్యవర్గం కొనసాగింపు

70చూసినవారు
కోదాడ పబ్లిక్ క్లబ్ పాత కార్యవర్గం కొనసాగింపు
కోదాడ పబ్లిక్ క్లబ్ జనరల్ బాడీ సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా సమావేశ ప్రారంభంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల నివాళులర్పించారు. అనంతరం పాత కార్యవర్గాన్ని సభ్యులందరి ఏకగ్రీవ ఆమోదంతో యధావిధిగా కొనసాగిస్తున్నట్లు ఎన్నికల అధికారి ఎస్ ఆర్ కె మూర్తి ప్రకటించారు. అధ్యక్షునిగా గాయం పట్టాభిరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా బొల్లు రాంబాబు లతో పాటు పలువురు కార్యవర్గ సభ్యులు ఎన్నికయ్యారు.

సంబంధిత పోస్ట్