సూక్ష్మ కళలో రాణించి కోదాడకు వన్నె తేవాలని ఎమ్మెల్యే పద్మావతి ఉత్తం అన్నారు. గురువారం కోదాడలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా సూక్ష్మ కళాకారుడు వెగ్గలం నరేష్ చారి అంగుళం సుద్దముక్కలపై చెక్కిన స్వాతంత్య్ర సమరయోధుల ప్రతిమలను భారతదేశ పటంపై అమర్చి ఎమ్మెల్యేకు బహుకరించిన సందర్భంగా ఆమె అభినందించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ సామినేని ప్రమీల, మాజీ సైనిక అధికారి మధుసూదన్ ఉన్నారు.