సమాజ సేవకు విరమణ ఉండదని పలువురు శ్రీమన్నారాయణ కాలనీ రచ్చబండ సభ్యులు అన్నారు. శుక్రవారం సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు పిల్లి డోర్నిస్ పదవి విరమణ పొందిన సందర్భంగా వారి నివాసంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ కట్టే బోయిన జ్యోతి శ్రీనివాస్ యాదవ్, చామర్తి బ్రహ్మం, రామినేని సత్యం, బొడ్డు వీరయ్య, మట్టపల్లి రావు, నక్క శంకర్, చంద్రం, పొట్ట జగన్మోహన్ రావు, కేతిరెడ్డి రాంరెడ్డి ఉన్నారు.