మోహన్ బాబు బేషరతుగా క్షమాపణ చెప్పాలి

2524చూసినవారు
మోహన్ బాబు బేషరతుగా క్షమాపణ చెప్పాలి
మోహన్ బాబు వెంటనే క్షమాపణ చెప్పాలి అని తెలంగాణ యాదవ్ స్టూడెంట్ ఫెడరేషన్ మోతే మండల అధ్యక్షుడు వీరబోయిన మహేష్ యాదవ్ అన్నారు. మోతే మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఒక సమావేశంలో ఆయన మాట్లాడుతూ. మోహన్ బాబు గొర్రెల కాపర్లు యాదవుల పై అనుచిత వ్యాఖ్యలు చేయటం సరికాదన్నారు. మొన్న మన రాష్ట్రంలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో మంచు విష్ణు గెలుపొందడం జరిగింది అన్నారు.

ఈ ప్రెస్ మీట్ లో మోహన్ బాబు మా ఎలక్షన్స్ లో జరిగిన ఘర్షణ ల గురించి ప్రస్తావిస్తూ చదువుకున్న వారి అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయి అని, అందరూ చూస్తున్నారు అని అన్నారు. అలాగే గొర్రెల కాపరి దగ్గర కూడా ఫోన్లు ఉన్నాయి అనటం సరైనది కాదు అని వీరబోయిన మహేష్ యాదవ్ అన్నారు. అలాగే సినీరంగం లో గొర్రెల కాపరిలైన, ఇతర శ్రమజీవుల అయిన సినిమాలు చూడటం వల్లనే వాళ్ల సినీరంగానికి గ్లామర్ పెరుగుతుందన్నారు. మోహన్ బాబు అలా మాట్లాడడం సమంజసం కాదు అన్నారు. ఇప్పటికైనా మోహన్ బాబు గారు వెంటనే గొర్రెల కాపరులకు క్షమాపణ చెప్పాలని అని అన్నారు. లేని పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్