అఖిల భారత విద్యార్థి సామెక్య జిల్లా కన్వీనర్ జుజ్జురి వేణు కుమార్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో మోతే మండలం సర్వారం గ్రామానికి చెందిన వీరబోయిన మహేష్ యాదవ్ ను AISF జిల్లా ఉపాధ్యక్షులు గోపగాని రవి , జిల్లా నాయకులు బూర వెంకటేశ్వర్లు కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వీరబోయిన మహేష్ యాదవ్ మాట్లాడుతూ.. AISF విద్యార్ధి సంఘం దేశంలోనే మొట్టమొదటి విద్యార్ధి సంఘం అని విద్యార్థుల హక్కుల సాధనకై అతను కృషిచేస్తానని తెలిపారు. అలాగే ఆయన మాట్లాడుతూ రాష్ట్రం ప్రభుత్వం విద్యార్థుల పట్ల, యువత పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని అన్నారు.
ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయకుండా కాలయాపన చేస్తూ ఉంటే నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అని ఆయన తీవ్రంగా వాపోయారు. ఈ ఆత్మహత్యలు అన్నీ ప్రభుత్వ హత్యలే అని, త్వరలోనే జిల్లాల్లో విద్యా ఉపాధి హక్కుల సాధనకై ఉద్యమ కార్యాచరణ ప్రణాళికను రూపొందించి జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేస్తాము అని అన్నారు. రాష్ట్రం లో యూనివర్సిటీ లకి నిధులు కేటాయించకుండా ప్రైవేట్ యూనివర్సిీలకి అనుమతులు ఇస్తూ కార్పొరేట్ కి దాసోహం గా మారిన ఈ ప్రభుత్వానికి తగిన బుద్ది చెప్పాలి అని అన్నారు. ఈ కార్యక్రమం లో జటంగి వేణు, జుజ్జురి రాకేష్, గుండెబోయిన మహేష్, ఉప్పుల పవన్, గండగని రంజిత్, పారెళ్ళి మనోజ్ కుమార్, గోపగాని మధు, జుజ్జురి మధు, మద్ది ఉపేందర్ రెడ్డి, చింత మణిదీప్ తదితరులు చేరారు.