కోదాడ పట్టణానికి చెందిన సూక్ష్మ కళాకారుడు వెంగళం నరేష్ చారి క్రిస్మస్ పర్వదినం సందర్భంగా అంగుళం సుద్ద ముక్కపై ఏసుప్రభు ప్రతిమ, పెన్సిల్ మొనపై ఏసుప్రభువు శిలువ ఆవిష్కరించి తన కళాత్మకతను చాటుకున్నాడు. నరేష్ చారి గతంలో సూక్ష్మవస్తులపై అనేక అద్భుత కళాఖండాలను ఆవిష్కరించి పలువురి మన్నలను పొందాడు. ప్రభుత్వం ప్రోత్సహిస్తే సూక్ష్మకులలో రాణించి రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతలు తెస్తానని చారి పేర్కొన్నాడు.