హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే అండర్ - 16 అంతర్ జిల్లా క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొనే ఉమ్మడి నల్గొండ జిల్లా జట్టుకు కోదాడ క్రికెట్ అకాడమీ క్రీడాకారులు పోలూరి మణికృష్ణ, మరికంటి భువన్ సాయి ఎంపికైనట్లు కోచ్ సిద్దిఖ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 17 నుండి జరిగే నల్గొండ జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా విజేతలను పలువురు అభినందించారు.