వరద బాధితుల కోసం కోదాడ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులు చేసిన సామాజిక సేవా కార్యక్రమం అభినందనీయమని కోదాడ మునిసిపల్ ఛైర్మన్ సామినేని ప్రమీల రమేష్, మండల విద్యాధికారి సలీం షరీఫ్ అన్నారు. శుక్రవారం కోదాడ బాలుర ఉన్నత పాఠశాలలో వరద బాధితుల సహాయార్థం విద్యార్థులు సేకరించిన 20 వేల రూపాయలతో కొనుగోలు చేసిన నిత్యావసర సరుకులను బాధితులకు పంపిణీ చేసిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.