సూర్యపేట జిల్లా కేంద్రంలో హైదరాబాద్ , సింగరేణి కాలనీలో అత్యాచారానికి గురైన ముక్కుపచ్చలారని ఆరేళ్ల పాప చిన్నారి చైత్ర ను అత్యాచారం చేసి హత్యచేసిన నిందితుడిని వెంటనే ఉరి తీయాలి లేదా ఎన్ కౌంటర్ చేయాలని వివిధ ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, గిరిజన సంఘాలు బారి సంఖ్యలో మహిళలతో బాబు జగ్జీవన్ రావు విగ్రహం వద్ద రోడ్డుపై బైఠాయించారు. నిందితుడిని ఎన్ కౌంటర్ చేసి బాధిత కుటుంబానికి కోటి రూపాయల ఎక్స్ గ్రెసియా, ఐదు ఎకరాల వ్యవసాయ భూమి, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఒకవేళ బాధిత కుటుంబానికి న్యాయం చేయకుండా, నింతుడిని ఎన్ కౌంటర్ చేయకుండా ఉంటే పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు చేపడతామని తెలంగాణ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గిరిజన శక్తి రాష్ట్ర సోషల్ మీడియా అధ్యక్షులు వెంకటేష్ నాయక్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీకాంత్ వర్మ, బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు వీరబోయిన లింగయ్య యాదవ్, టీఎస్ఎఫ్ రాష్ట్ర నిర్వాహక అధ్యక్షులు బారి అశోక్ కుమార్, ఎస్ఎఫ్ఐ డివిజన్ కార్యదర్శి వేల్పుల ఉత్తేజ్, ఆల్ ఇండియా బంజారా సేవ సంఘం ఆత్మకూర్ మండల అధ్యక్షులు సుమన్ నాయక్, గిరిజన నాయకులు నిరీక్షన్, దేవేందర్, చందు, అఖిల్, హుస్సేన్, మహిళలు పాల్గొన్నారు.