ఉపాధ్యాయుల సేవలు ఎనలేనివని కోదాడ ఆర్టీసీ డిపో మేనేజర్ శ్రీహర్ష అన్నారు. గురువారం కోదాడ బాలుర ఉన్నత పాఠశాలలో అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకొని ఎంఇఓ సలీం షరీఫ్, హెడ్ మాస్టర్ డి మార్కండేయ, స్కూల్ అసిస్టెంట్ పద్మావతిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ టి నాగశ్రీ, ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు.