కోదాడ మండలం రామాపురం క్రాస్ రోడ్డు వద్ద యాచకుడు మృతి చెందాడు. గత 47 ఏళ్ల క్రితం ఈ ప్రాంతానికి వచ్చిన ఈ వ్యక్తి మూగవాడు. కాగా ఇతడు కొంతకాలం క్రాస్ రోడ్ లో హోటల్లో పనిచేసేవాడు. మాటలు రాకపోవడంతో ఇతన్ని మూగవాడిగా అక్కడివారు పిలిచేవారు. వయసు మీద పడడంతో పని వదిలి యాచకునిగా జీవనం గడుపుతున్నాడు. కాగా శనివారం అనారోగ్యంతో మృతి చెందాడు.