జగన్నాధపురం: ఎస్జీటీ ఉపాధ్యాయులకు ఎమ్మెల్సీ ఓటు హక్కు కల్పించాలి
జగన్నాధపురం ప్రాథమికోన్నత పాఠశాలలో ఎస్జీటీగా పనిచేస్తున్న వి. భరత్ బాబు ప్రాథమికోన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఎస్జీటీ ఉపాధ్యాయులు అందరికీ ఎమ్మెల్సీ ఓటు హక్కు కల్పించాలన్నారు. దానికోసం ఎస్జీటీ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కే. మహిపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఆర్. వెంకటేశం, కేంద్ర ఎలక్షన్ కమిషన్కు నివేదిక అందించడానికి ఎమ్మెల్సీ ఓటు హక్కు సాధనకు గురువారం ఢిల్లీకి చేరుకున్నారని తెలిపారు.