దేశవ్యాప్తంగా విద్యార్థి ఉద్యమాలలో అలుపెరగని ఉద్యమాలు నిర్వహించి స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న ఏకైక విద్యార్థి సంఘంగా ఏఐఎస్ఎఫ్ ది అగ్రస్థానం అని ఏఐఎస్ఎఫ్ మాజీ జిల్లా కార్యదర్శి సిహెచ్ సీతారాం అన్నారు. సోమవారం మునగాల మండల కేంద్రంలో నిర్వహించిన ఏఐఎస్ఎఫ్ 89వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి జి శివ జెండాని ఆవిష్కరించినారు.