మునగాల మండల పరిధిలోని కొక్కిరేణి గ్రామంలో గల (ఎల్ 30-31) ఎత్తిపోతల పథకం చైర్మన్ మేదరమెట్ల వెంకటేశ్వరరావు శనివారం కొక్కిరేణి గ్రామంలో నీటిని విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. ఎత్తిపోతల పథకం కింద రైతులు అందరూ సమిష్టిగా నీటిని వినియోగించుకోవాలని అన్నారు. విడుదల చేసిన నీటిని సాగు, త్రాగునీటి కోసం ఉపయోగించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈ నరసింహమూర్తి, తదితరులు పాల్గొన్నారు.