మునగాల మండల విద్యాధికారి పర్యవేక్షణ
మునగాల మండల కేంద్రం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న ఉపాధ్యాయుల సముదాయ సమావేశాలను ఐదు మండలాల ఎంఈఓ సలీం షరీఫ్ బుధవారం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, విద్యార్థుల్లో ఆశించిన అభ్యసన ఫలితాలు వచ్చే విధంగా బోధనా కార్యక్రమం చేయవలెనని, అదేవిధంగా జాతీయ సాధన పరీక్ష గురించి మూడు, ఆరు తరగతుల విద్యార్థులను సిద్ధం చేయాలని, తద్వారా జిల్లా మొదటి స్థానంలో ఉండే విధంగా చూడాలని ఉపాధ్యాయులను కోరారు.