మునుగోడును దొంగలు హడలెత్తించారు. తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్ చేస్తూ వరుసగా ఐదు చోట్ల చోరీలకు పాల్పడ్డారు. తన స్వీట్ హౌస్లో రూ.70 వేలు, ఇంట్లో 12 తులాల బంగారం దొంగతనం చేశారని బాధితుడు నాగరాజు తెలిపారు. తమ ఇంట్లో రూ. 2 లక్షల 50 వేల నగదు పోయిందని వడ్డెరగూడెంకు చెందిన ముద్దంగుల నర్సింహ్మ వాపోయాడు. గురువారం దొంగలను పట్టుకుని సొత్తును స్వాధీనం చేసుకోవాలని పోలీసులను కోరారు.