జిల్లా కేంద్రంలో కొత్త బస్టాండ్ నుంచి కుడకడ శివారు వరకు రహదారి గుంతలమయంగా మారింది. ఈ దారెంట నిత్యం వేలాదిమంది ప్రయాణిస్తుంటారు. ప్రజల ఇబ్బందుల దృష్ట్యా అధికారులు ఇటీవల కంకర పోశారు. రోడ్డుకు మరమ్మతులు చేస్తారని వాహనచోదకులు భావించినా అధికారులు ఆ ఊసెత్తటం లేదు. కంకర పోసి వదిలేయడంతో దుమ్ము లేస్తోంది. అధికారులు ఈ సమస్యని పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.