ది అపరాలు అండ్ దాల్ మిల్లర్స్ అసోసియేషన్ కార్యవర్గన్ని ఏకగ్రీవంగా ఆదివారం ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా దేవరశెట్టి రవిశంకర్, కార్యదర్శిగా చల్లా వెంకన్న, కోశాధికరిగా పైడిమర్రి రమేష్ లను ఎన్నుకున్నారు. ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు అసోషియేషన్ సభ్యులందరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ అసోషియేషన్ అభివృద్ధితో పాటు వ్యాపారంలో కలిగే ఇబ్బందులను ఎప్పటికప్పుడు పరిష్కరించేందు కృషి చేస్తానని రవిశంకర్ తెలిపారు.