శ్రావణమాసం రెండవ శుక్రవారం పురస్కరించుకొని సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ సంతోషిమాత దేవాలయంలో శుక్రవారం శ్రీ సంతోషిమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయ ప్రధాన అర్చకులు ఇరువంటి శివరామకృష్ణ శర్మ తెల్లవారుజామునే శ్రీ సంతోషిమాతకు ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. భక్తులు సమర్పించిన పట్టు వస్త్రములు అమ్మవారికి అలంకరించి ప్రత్యేక కుంకుమార్చనలు నిర్వహించారు.