ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి దిష్టి బొమ్మ దగ్ధం

1535చూసినవారు
ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి దిష్టి బొమ్మ దగ్ధం
తెలంగాణ తల్లి విగ్రహం వద్ద బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి దిష్టి బొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్బంగా లింగయ్య యాదవ్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ప్రజాప్రతినిధి అయితే ఓర్వలేక అసత్య ఆరోపణలు చేస్తూ పరువు తీస్తున్నారని అన్నారు. బీసీ ప్రజాప్రతినిధుల జోలికొస్తే బీసీ విద్యార్థి సంఘం సహించమని అన్నారు. బొల్లం మల్లయ్య యాదవ్ కు వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే ఉత్తమ్ ఇంటిని వేలాది బీసీ సంఘం సభ్యులతో కలసి ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీసీ యూవజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు సురాగాని రాంబాబు, వల్లపు నరేష్, పాక సందీప్ యాదవ్, రమేష్, మహేష్, లింగరాజు, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్