ప్రజలు వారి ఇళ్ళలోని పెంపుడు జంతువులకు తప్పక ప్రతి ఆరు నెలలకు ఒకసారి టీకాలు వేయించాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ సూచించారు. శనివారం ప్రపంచ రేబీస్ దినోత్సవం సందర్భంగా జిల్లా పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో జంతువులకు ఉచిత టీకాల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జంతు ప్రేమికులు వాటి పట్ల అవగాహన కలిగి ఉండాలని సూచించారు.