సూర్యాపేట మున్సిపాలిటీ స్థానిక పిల్లలమర్రి గ్రామంలోని చారిత్రాత్మకమైన 12వ శతాబ్దానికి చెందిన శ్రీ ఎర్రకేశ్వర స్వామి దేవాలయంలో నేడు ప్రత్యేక పూజ నిర్వహించారు. ఆదివారం పురస్కరించుకొని పరమశివునికి ప్రత్యేకంగా పంచామృతలతో అభిషేకాలు నిర్వహించారు. పుష్పార్చన, బిల్వర్చన, నీరాజన మంత్రపుష్పం నిర్వహించారు. భక్తులకు పరమశివుడు దివ్యదర్శనంలో దర్శనమిచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించారు.